డిల్లీ, 29 మే (హి.స.)న్యాయమూర్తుల బృందం ఇచ్చిన తీర్పులో.. అంతర్జాతీయ వాణిజ్యాన్ని నియంత్రించే అధికారం కేవలం కాంగ్రెస్‌కే ఉందని, అధ్యక్షుడికి అత్యవసర అధికారాలు ఉన్నా అవి ఆ అధికారం మీద ప్రభావం చూపవని స్పష్టం చేసింది కోర్టు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ట్రంప్ ప్రభుత్వం “లిబరేషన్ డే” పేరుతో అన్ని దిగుమతులపై కనిష్ఠంగా 10% సుంకాన్ని విధిస్తూ, ఎక్కువ ట్రేడ్ సర్ప్ ప్లస్ కలిగిన దేశాలపై మరింత అధిక సుంకాలు విధించనున్నట్లు ప్రకటించింది. ఈ చర్య ద్వారా స్థానిక పరిశ్రమల ఉత్పాదకతను పెంచాలని, ట్రేడ్ డెఫిసిట్‌ను తగ్గించాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు.
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు