
న్యూఢిల్లీ, 29 మే (హి.స.)
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాలైన గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, హర్యాణా, జమ్ము కాశ్మీర్ లో నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఆ మాక్ డ్రిల్స్ వాయిదా పడ్డాయి. ఆపరేషన్ షీల్డ్ పేరుతో నిర్వహించాల్సిన ఈ మాక్ డ్రిల్స్ను కేంద్ర హోం శాఖ ఆదేశాలతో వాయిదా వేసినట్లు హర్యాణా ప్రభుత్వం వెల్లడించింది. పరిపాలనా కారణాల వల్ల ఈ మాక్ డ్రిల్స్ వాయిదా వేస్తున్నట్లు రాజస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. త్వరలో కొత్త తేదీలను ప్రకటిస్తామని తెలిపింది. ఇక జూన్ 3న మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నట్లు పంజాబ్ వెల్లడించింది.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..