హైదరాబాద్, 29 మే (హి.స.)మహమ్మారి కరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతోంది. దేశంలో యాక్టివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా కొవిడ్ కలకలం రేపుతోంది. ముఖ్యంగా ఏపీలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా మరో మూడు కొవిడ్ కేసులు నమోదు అయ్యాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మూడు కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ మహిళకు పరీక్షలో కోవిడ్ నిర్ధారణ అయింది. చిలకలూరిపేటకు చెందిన వృద్దుడు, బాపట్లకు చెందిన మరో మహిళకు పాజిటివ్‌గా తేలింది
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు