
అమరావతి, 30 మే (హి.స.)
గుంతకల్లు, : రైల్వే ప్రయాణికుల సురక్షిత ప్రయాణం కోసం డివిజన్ అధికారులు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చారు. రైల్వేలో తరచుగా ఎదురెదురుగా వచ్చే రైళ్లు ఢీకొనడం, రైళ్లు డేంజర్ సిగ్నళ్లను దాటుకుని ప్రయాణించడం లాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. ఆయా ఘటనల్లో పలువురు ప్రయాణికులు ప్రాణాలను కోల్పోతున్నారు. భారీ స్థాయిలో రూ.కోట్లు విలువచేసే రైల్వే ఆస్తులు ధ్వంసమవుతున్నాయి. వీటిని కట్టడి చేసేందుకు రైల్వే శాఖ కసరత్తు ప్రారంభించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ