
హైదరాబాద్, 30 మే (హి.స.), : డిగ్రీలో కనీసం 75 శాతం హాజరు లేకుంటే ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందేందుకు అర్హత ఉండదని విశ్వవిద్యాలయాల ఉపకులపతుల సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్ బాలకిష్టారెడ్డి ఆధ్వర్యంలో ఏడు సంప్రదాయ వర్సిటీల వీసీల సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశంలో..డిగ్రీలో కనీసం 75 శాతం హాజరు లేకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హత లేదని గతంలోనే ప్రభుత్వ ఆదేశాలున్నాయని, కానీ అది అమలు కావడం లేదని వీసీలు ప్రస్తావించారు. ఈసారి హాజరును ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ముడిపెట్టి తప్పనిసరిగా ఈ ఆదేశాలను అమలు చేయాలని నిర్ణయించారు. దీంతో కొంత వరకు విద్యానాణ్యత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు మూడేళ్ల డిగ్రీకి 150 క్రెడిట్లు ఉండగా వాటిని 142కు కుదించాలని నిర్ణయించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ