
హైదరాబాద్, 30 మే (హి.స.)
పాక్ పై యుద్ధ విరమణను
తప్పుపడుతూ ప్రధాని నరేంద్ర మోడీపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ ఫైర్ అయింది. 'విమానం అంటే దిల్సుఖ్నగర్ రోడ్ పక్కన దొరికే బొమ్మ అనుకునే సీఎం రవ్వంత రెడ్డి గారు మీరు రాఫెల్ గురించి మాట్లాడితే ఒకటో తరగతి పోరగాడు కూడా నవ్వుతాడు అంటూ టీ బీజేపీ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నుండి ఆ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి వరకు మన సైన్యాన్ని నిత్యం కించపరుస్తూనే ఉన్నారని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చౌకబారు రాజకీయాలు చేయడం ఇదే మొదటి సారి కాదని సర్జికల్ స్ట్రైక్స్ ను ప్రశ్నించారని ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీకి మన శత్రు భాష మాట్లాడటం పరిపాటేనన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..