బొప్పాయిలో మనకు అధిక పరిమాణంలో విటమిన్ లభిస్తుంది
కర్నూలు, 31 మే (హి.స.) బొప్పాయి పండులో మనకు అధిక పరిమాణంలో విటమిన్ ఎ లభిస్తుంది. దీనితోపాటు బి1, బి2, బి3, సి-విటమిన్లు, కాల్షియం, ఇనుము, భాస్వరం వంటి ఖనిజ లవణాలు బొప్పాయిలో సమృద్ధిగా ఉంటాయి.. బొప్పాయిలో ఫోలేట్ కూడా ఉంటుంది.. ఇది చాలా ఆరోగ్యకరమైనద
బొప్పాయి


కర్నూలు, 31 మే (హి.స.)

బొప్పాయి పండులో మనకు అధిక పరిమాణంలో విటమిన్ ఎ లభిస్తుంది. దీనితోపాటు బి1, బి2, బి3, సి-విటమిన్లు, కాల్షియం, ఇనుము, భాస్వరం వంటి ఖనిజ లవణాలు బొప్పాయిలో సమృద్ధిగా ఉంటాయి.. బొప్పాయిలో ఫోలేట్ కూడా ఉంటుంది.. ఇది చాలా ఆరోగ్యకరమైనది. అందుకే.. దీనిని సూపర్ ఫ్రూట్ గా పేర్కొంటారు.

బొప్పాయిలో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. దీనిని రెగ్యులర్‌గా తినడం వల్ల ఎన్నో సమస్యల నుంచి బయటపడొచ్చు.. బొప్పాయిని తినడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి.. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి కూడా మంచిది.. అంతేకాకుండా.. బరువును కూడా తగ్గిస్తుంది. అందుకే.. విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండే బొప్పాయిని క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు..

బొప్పాయిలోనే మనకు అధిక పరిమాణంలో విటమిన్ ఎ లభిస్తుంది. దీనితోపాటు బి1, బి2, బి3, సి-విటమిన్లు, కాల్షియం, ఇనుము, భాస్వరం వంటి ఖనిజ లవణాలు బొప్పాయిలో సమృద్ధిగా ఉంటాయి.. బొప్పాయిలో ఫోలేట్ కూడా ఉంటుంది.. ఇది చాలా ఆరోగ్యకరమైనది. ఇందులో పొటాషియం.. మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇది కంటి సమస్యలను దూరం చేసి కంటిశుక్లం సమస్యను కూడా తొలగిస్తుంది. బొప్పాయిలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande