శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద
శ్రీశైలం, 31 మే (హి.స.)శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇన్ ఫ్లో 41,427 క్యూసెక్కులు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఔట్‌ ఫ్లో న
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద


శ్రీశైలం, 31 మే (హి.స.)శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇన్ ఫ్లో 41,427 క్యూసెక్కులు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఔట్‌ ఫ్లో నిల్‌‌. ఈ క్రమంలో శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 821.90 అడుగులకు చేరింది.

ఇదిలా ఉంటే.. శ్రీశైలం జలాశయం నీటిమట్టం నీటిమట్టం నిన్న(శుక్రవారం) ఉదయం 6 గంటల సమయానికి 818.20 అడుగులుగా ఉంది. నీటి నిల్వ 39,5529 టీఎంసీలుగా నమోదైంది. అయితే.. ప్రతి ఏటా జూన్ తర్వాత శ్రీశైలంలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. కానీ.. ఈసారి మాత్రం మే నెలలోనే వరద కొనసాగుతోంది. ఇటీవల కురిసిన వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతున్నట్లు అధికారుల అంచనా. ఈ క్రమంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande