
హైదరాబాద్, 1 జూన్ (హి.స.)
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సామాజిక న్యాయ కార్యక్రమాలపై ఎంపీ మల్లు రవి నేడు మీడియాతో మాట్లాడుతూ.. “తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను గత ప్రభుత్వాలు విస్మరించాయి. నీళ్లు, నిధులు, నియామకాల పేరిట ప్రజలను మోసం చేశాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సామాజిక న్యాయం లక్ష్యంగా పాలన కొనసాగుతోంది,” అని పేర్కొన్నారు.
ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమైన చర్యలలో భాగంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం సుమారు 25 లక్షల మంది రైతులకు రూ. 22,000 కోట్ల పంట రుణాలను మాఫీ చేసినట్లు మల్లు రవి చెప్పారు. ఇది రాష్ట్ర రైతాంగానికి పెద్ద ఊరటగా నిలిచిందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ. 200 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా 100 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసింది. కుల, మతాలతో సంబంధం లేకుండా ప్రతి పేద విద్యార్థి గుణాత్మక విద్య పొందేలా వీటిని తీర్చిదిద్దినట్లు తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..