
దిల్లీ, జూన్ (హి.స.) 2026-27 విద్యా సంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయాల్లో (JNV) ఆరో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ వచ్చేసింది. దేశ వ్యాప్తంగా 654 జేఎన్‌వీల్లో 6వ తరగతిలో సీట్ల భర్తీకి రెండు విడతల్లో ఎంపిక పరీక్ష నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాలు సహా పలు రాష్ట్రాల్లో 2025 డిసెంబర్ 13 (శనివారం)న ఉదయం 11.30 గంటలకు; జమ్మూ కశ్మీర్ సహా పలు పర్వత ప్రాంత రాష్ట్రాల్లో 2026 ఏప్రిల్ 11న JNV ప్రవేశ పరీక్ష( నిర్వహించనున్నట్టు అధికారులు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈ పరీక్షకు అర్హులైన విద్యార్థులు జూలై 29 వరకు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ