ఓఆర్ఆర్ పై కెమికల్ ట్యాంకర్ బోల్తా.. ఎగిసి పడిన మంటలు
హైదరాబాద్, 10 జూన్ (హి.స.) శామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓఆర్ఆర్ పై కెమికల్ ట్యాంకర్ కింద పడింది. మంగళవారం ఉదయం క్రేన్ సాయంతో ట్యాంకర్ ను తొలగిస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమై సిబ్బంది వెంటనే ఫైర్ స్టేషన్ కి సమాచారం అందించ
కెమికల్ ట్యాంకర్


హైదరాబాద్, 10 జూన్ (హి.స.)

శామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓఆర్ఆర్ పై కెమికల్ ట్యాంకర్ కింద పడింది. మంగళవారం ఉదయం క్రేన్ సాయంతో ట్యాంకర్ ను తొలగిస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమై సిబ్బంది వెంటనే ఫైర్ స్టేషన్ కి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పారు. మేడ్చల్ ట్రాఫిక్ సీఐ హనుమాన్ గౌడ్ అటువైపు వాహనాలు వెళ్లకుండా బార్కెట్లు ఏర్పాటు చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande