ముంబై, 10 జూన్ (హి.స.)దేశంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటున్నాయి. భాతీరయ సాంప్రదాయంలో బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. తాజాగా జూన్ 10వ తేదీన దేశీయంగా బంగారం ధరల్లో స్వల్ప మార్పు ఉంది. తులం బంగారం ధరపై అతి స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 97,680 రూపాయలు ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 89,540 రూపాయల వద్ద ఉంది.
చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 97,680 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 89,540 రూపాయల వద్ద కొనసాగుతోంది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 97,680 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 89,540 రూపాయల వద్ద ఉంది. అదే దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 97,830 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 89,690 రూపాయల వద్ద కొనసాగుతోంది.
---------------
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి