ముంబై, 5 జూన్ (హి.స.)పసిడి, వెండికి ఎల్లప్పుడూ డిమాండే ఉంటుంది.. బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతూ వస్తుంటాయి.. అయితే.. ఇటీవల కాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ఏప్రిల్ నెలలో ఏకంగా లక్ష దాటిన పసిడి ధరలు.. ఆ తర్వాత తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి.. ఇటీవల కాలంలో లక్ష నుంచి 95వేల వరకు దిగొచ్చిన పసిడి ధరలు.. ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే 99 వేలు దాటింది. ఈ క్రమంలోనే.. తాజాగా బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి.. జూన్ 05 2025 గురువారం ఉదయం వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 99,180 ఉండగా.. 22 క్యారెట్ల ధర 90,910 గా ఉంది. 10గ్రాముల గోల్డ్ ధరపై రూ.10 మేర పెరిగింది. వెండి కిలో ధర రూ.100 పెరిగి.. రూ.1,02,100లుగా ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి