
ముంబై, 10 ఏప్రిల్ (హి.స.)పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. గత కొన్ని రోజుల నుంచి పరుగులు పెట్టిన బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. దీంతో మగువలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అసలే పెళ్లీల సీజన్ , దీంతో చాలా మంది బంగారం కొనుగోలు చేయడం కోసం ఎంతగానో ఎదురు చూస్తుంటారు. ఎప్పుడు ఎప్పుడు బంగారం ధరలు పతనం అవుతాయా? అని చూడగా, నేడు స్వల్పంగా తగ్గింది. కాగా, హైదరాబాద్ మార్కెట్లో నేడు తులం బంగారం ఎంత ఉందో చూద్దాం.
.
గుడ్ రిటర్న్స్ ప్రకారం, హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏప్రిల్ 10 శుక్రవారం రోజున రూ.10 తగ్గడంతో తులం బంగారం ధర రూ. 1,51,470గా ఉంది.
విజయవాడ మార్కెట్లో బంగారం ధరల విషయానికి వస్తే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏప్రిల్ 10 శుక్రవారం రోజున రూ.10 తగ్గడంతో తులం బంగారం ధర రూ. 1,51,470గా ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV