బంగారాన్ని బీభత్సంగా కొన్న ఆ రెండు దేశాలు! మరి భారత్ పరిస్థితి ఏంటంటే?
బంగారాన్ని బాగా కొంటున్న దేశాలు
gold


ముంబై, 12 ఏప్రిల్ (హి.స.)ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో బంగారం మళ్లీ ప్రధాన పెట్టుబడి సాధనంగా మారుతోంది. ముఖ్యంగా చిన్న దేశాలు కూడా భారీగా బంగారం కొనుగోలు చేస్తూ, పెద్ద ఆర్థిక వ్యవస్థలకు పోటీగా నిలుస్తున్నాయి. ఇటీవల గణాంకాల ప్రకారం పోలాండ్ ఫిబ్రవరి నెలలోనే 20 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసి ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానంలో నిలిచింది. ఈ కొనుగోలుతో ఆ దేశపు మొత్తం బంగారు నిల్వలు సుమారు 570 టన్నులకు చేరాయి. గత ఏడాది కాలంలోనే పోలాండ్ దాదాపు 102 టన్నుల బంగారాన్ని సేకరించడం విశేషం.

అదేవిధంగా ఉజ్బెకిస్థాన్ కూడా బంగారం కొనుగోళ్లలో చురుకుగా ఉంది. ఫిబ్రవరిలో 8 టన్నుల బంగారం కొనుగోలు చేసిన ఈ దేశం, తన మొత్తం నిల్వలను 407 టన్నులకు పెంచుకుంది. 2025లో మాత్రమే 10–15 టన్నుల మధ్య బంగారాన్ని జోడించినట్లు సమాచారం. ఇక భారత్ విషయానికి వస్తే, ఫిబ్రవరిలో బంగారం కొనుగోలు తక్కువగా నమోదైంది. ఈ నెలలో కేవలం 0.2 టన్నుల బంగారాన్ని మాత్రమే భారత్ కొనుగోలు చేసింది. అయితే మొత్తం బంగారు నిల్వలు సుమారు 880 టన్నులుగా ఉన్నాయి. గత ఏడాదిలో భారత్ సుమారు 27 టన్నుల బంగారాన్ని సేకరించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande