సంవత్సరం పాటు పాఠశాలకు హాజరుకాకపోయినా ఉపాధ్యాయురాలికి వేతనం చెల్లించిన విషయంలోఎంఈఓ మరియు హెచ్ఎం సస్పెండ్..
తెలంగాణ, నల్గొండ. 10 జూన్ (హి.స.) సంవత్సరం పాటు పాఠశాలకు హాజరుకాకపోయినా ఉపాధ్యాయురాలికి వేతనం చెల్లించిన విషయం పై మండల విద్యాధికారి మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ నల్గొండ జిల్లా విద్యాధికారి విజయలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరక
నల్గొండ విద్యాశాఖ


తెలంగాణ, నల్గొండ. 10 జూన్ (హి.స.)

సంవత్సరం పాటు పాఠశాలకు హాజరుకాకపోయినా ఉపాధ్యాయురాలికి వేతనం చెల్లించిన విషయం పై మండల విద్యాధికారి మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ నల్గొండ జిల్లా విద్యాధికారి విజయలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సంబంధిత ఘటనపై విచారించి, నల్లగొండ జిల్లా చందంపేట మండల విద్యాధికారి చందర్, ఆమెకు వేతనం చెల్లించిన కాంప్లెక్స్ హెడ్మాస్టర్ ను కూడా అధికారులు సస్పెండ్ చేశారు. ఈ చర్యలు విద్యావ్యవస్థలో పారదర్శకతను మెరుగుపరచాలనే దిశగా తీసుకున్నాయని అధికారులు పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande