నిజామాబాద్ 10 జూన్ (హి.స.)
నిజామాబాద్ నగరంలో సోమవారం రాత్రి భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం నగరాన్ని అతలాకుతలం చేసింది. ముఖ్య కూడళ్లలో చెట్లు నేలకొరిగాయి, విద్యుత్ తీగలు తెగిపోయాయి. ముఖ్యంగా గంగాస్థాన్, కంటేశ్వర్, పాలిటెక్నిక్ కళాశాల, పులాంగ్ ప్రాంతాల్లో భారీ వృక్షాలు కూలిపోయాయి. ఈదురుగాలులతో విద్యుత్ తీగలు తెగిపోవడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీనివల్ల నగరమంతా అంధకారంలో మునిగిపోయింది. ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
చెట్ల కొమ్మలు విరిగిపడి రోడ్లపై పడటంతో ట్రాఫిక్ తీవ్రంగా ప్రభావితమైంది. పరిస్థితిని అదుపులోకి తేవడంలో ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది చురుకుగా వ్యవహరించారు. వర్షం లోనూ రోడ్డుపై చెట్లు, కొమ్మలను తొలగిస్తూ ట్రాఫిక్‌ను పునరుద్ధరించే పనిలో నిమగ్నమయ్యారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్