తెలంగాణ హైకోర్టులో హరీష్ రావుకు ఊరట..
హైదరాబాద్, 10 జూన్ (హి.స.) తెలంగాణ హైకోర్టు లో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కు ఊరట లభించింది. 2023 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గెలుపు చెల్లదంటూ బీఎస్సీ అభ్యర్థిగా పోటీలో ఉన్న, ప్రస్తుత కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ పిటిషన్ దాఖలు చ
హరీష్ రావు


హైదరాబాద్, 10 జూన్ (హి.స.)

తెలంగాణ హైకోర్టు లో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కు ఊరట లభించింది. 2023 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గెలుపు చెల్లదంటూ బీఎస్సీ అభ్యర్థిగా పోటీలో ఉన్న, ప్రస్తుత కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ పిటిషన్ దాఖలు చేశారు.హరీష్ రావు తన ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారాన్ని అందించాడని అతని ఎన్నికపై అనర్హత వేటు వేయాలని కోర్టును కోరారు. ఆ పిటిషన్ పై ఈ రోజు విచారించిన హైకోర్టు సరైన ఆధారాలు లేకపోవడంతో హరీష్ రావు ఎన్నిక చెల్లదంటూ వేసిన పిటీషన్‌ను కొట్టి వేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande