హైదరాబాద్, 10 జూన్ (హి.స.) రాష్ట్రంలో జూన్ 12 నుంచి పాఠశాలలు పున: ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యా శాఖ అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. 2025 – 26 విద్యా సంవత్సరంలో స్కూళ్లకు 230 వర్కింగ్ డేస్ ఉంటాయని తెలిపింది.2025, జూన్ 12న క్లాసులు ప్రారంభం కానుండగా 2026, ఏప్రిల్ 23న లాస్ట్ వర్కింగ్ డేగా పేర్కొంది. జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉండనున్నాయి. ఎస్‌ఏ 1 పరీక్షలు అక్టోబర్ 24 – 31 వరకు, ఎస్‌ఏ 2 ఏప్రిల్ 10 – 18 వరకు ఉంటాయి. మధ్య మధ్యలో ఫార్మెటివ్ అసెట్‌మెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి. దసరాకు సెప్టెంబర్ 21 – అక్టోబర్ 3 వరకు, క్రిస్మస్‌కు డిసెంబర్ 23 – 27 వరకు, సంక్రాంతికి జనవరి 11 – 15 వరకు సెలవులు ఉండనున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్