బాలయ్య పుట్టిన రోజు వేళ.. సోదరి భువనేశ్వరి ఆసక్తికర ట్వీట్
అమరావతి, 10 జూన్ (హి.స.)టాలీవుడ్ సీనియర్ హీరో, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ (TDP MLA Balakrishna) ఈ రోజు 65వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖులు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇందులో భాగంగా.. తన సోదర
బాలయ్య పుట్టిన రోజు వేళ.. సోదరి భువనేశ్వరి ఆసక్తికర ట్వీట్


అమరావతి, 10 జూన్ (హి.స.)టాలీవుడ్ సీనియర్ హీరో, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ (TDP MLA Balakrishna) ఈ రోజు 65వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖులు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇందులో భాగంగా.. తన సోదరి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి భార్య అయిన నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari.).. బాలయ్యకు శుభాకాంక్షలు తెలుపుతు ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.

అమె తన ట్వీట్‌లో.. నాన్నగారి నట వారసత్వం తో పాటు మంచి మనస్సు, కాస్త చిలిపితనం, ఎంతో క్రమశిక్షణ, దైవ భక్తి కలగలిసిన, మనందరి అభిమాన నటుడు, మా బాల అన్నయ్యకి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని రాసుకొచ్చారు. కాగా బాలయ్య ప్రస్తుతం అఖండ 2 (Akhand 2) సినిమాలో నటిస్తుండగా.. పుట్టినరోజు సందర్భంగా సోమవారం సాయంత్రం.. ఆ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల చేశారు. ప్రస్తుతం అఖండ 2 టీజర్ (Nara Bhuvaneshwari) సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా యూట్యూబ్ లో దుమ్ములేపుతున్న సంగతి తెలిసిందే.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande