అమరాతవి, 10 జూన్ (హి.స.)శతాధిక చిత్రాల కథనాయకుడు నందమూరి బాలకృష్ణకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
కథానాయకుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ ట్వీట్చేశారు. ‘చారిత్రక, పౌరాణిక, జానపద పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించిన కథానాయకుడు ఆయన అంటూ ఆ ట్వీట్లో పేర్కొన్నారు. ప్రజా జీవితంలో హిందూపురం ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలు, సుఖ శాంతులతో ఉండాలని ఆకాంక్షించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి