
న్యూఢిల్లీ, 11 జూన్ (హి.స.)
కొత్త మంత్రులకు తన వద్ద ఉన్న శాఖలనే కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.. పాత మంత్రుల శాఖల్లో ఎటువంటి మార్పులు ఉండవని ఆయన సంకేతాలు ఇచ్చారు.. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన ఇవాళ తన పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు బయల్దేరే ముందు ఢిల్లీలో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్ లో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరిగిన మంత్రివర్గ విస్తరణపై ఢిల్లీలో ఎలాంటి చర్చ జరగలేదని, కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుల అంశం ప్రస్తావనకు రాలేదన్నారు. హైదరాబాద్‌కు వచ్చాక అందరితో సంప్రదించి శాఖలు నిర్ణయిస్తామన్నారు. తాను ఢిల్లీకి వచ్చింది కర్ణాటకలో కులగణన అంశంపై అధిష్టానంతో చర్చించేందుకేనని చెప్పారు. కేసీఆర్ కుటుంబ సభ్యులే తెలంగాణకు శత్రువులు అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తానున్నంత వరకు కాంగ్రెస్‌లోకి కేసీఆర్ కుటుంబానికి ఎంట్రీ లేదని హాట్ కామెంట్స్ చేశారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..