ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచాలి.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య
శ్రీరాంపూర్ పెద్దపల్లి, 12 జూన్ (హి.స.) ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య కోరారు. కాల్వ శ్రీరాంపుర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో గురువారం నిర్వహించి
ఎమ్మెల్సీ


శ్రీరాంపూర్ పెద్దపల్లి, 12 జూన్ (హి.స.)

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల

సంఖ్య పెంచే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య కోరారు. కాల్వ శ్రీరాంపుర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన బడిపాట కార్యక్రమంలో ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య పాల్గొన్నారు.

పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కొమురయ్య మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడలపై శ్రద్ధ కనబరిచి ఆటల లో గెలవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుందని ఉపాధ్యాయులు విద్యార్థుల సంఖ్య పెంచే విధంగా చూడాలన్నారు. బడిబాటలో ప్రతీ ఇంటికి ఉపాధ్యాయులు తిరిగి ఒక ఉపాధ్యాయుడు 20 మంది విద్యార్థులను పాఠశాలలో చేర్చే విధంగా చూడాలన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande