ఇది మార్పు కాదు.. ఏమార్పు.. రేవంత్ పాలనపై హరీశ్ రావు సెటైర్
హైదరాబాద్, 12 జూన్ (హి.స.) తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. గ్రామ పంచాయతీలకు నిధుల విషయంలో మరోసారి ఆయన ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. 16 నెలలుగా రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు
హరీష్ రావు


హైదరాబాద్, 12 జూన్ (హి.స.)

తెలంగాణలోని రేవంత్ రెడ్డి

ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. గ్రామ పంచాయతీలకు నిధుల విషయంలో మరోసారి ఆయన ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. 16 నెలలుగా రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల కావడం లేదని జీపీ ట్రాక్టర్లను నడపలేక పంచాయతీ కార్యదర్శులు వాటి తాళాలను ఉన్నతాధికారులకు అప్పగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా గురువారం హరీశ్ రావు పోస్టు చేస్తూ కాంగ్రెస్ చెప్పిన మార్పు ఇదేనా రేవంత్ రెడ్డి గారు? అని ప్రశ్నించారు. ఇది మార్పు కాదు ఏ మార్పు అంటూ ఎద్దేవా చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande