అమరావతి, 14 జూన్ (హి.స.)
అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ దుర్ఘటన అందంలో మృతుల సంఖ్య )లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 274కు చేరినట్లు తాజాగా అధికారులు వెల్లడించారు. వీరిలో 241 మంది విమాన ప్రయాణికులు, సిబ్బంది కాగా.. నివాస సముదాయంలోని ప్రజలు కొంతమంది మరణించినట్లు తెలిపారు.
గురువారం మధ్యాహ్నం 1.38 గంటలకు అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. టేకాఫ్ అయిన క్షణాల్లోనే విమానాశ్రయానికి సమీపంలోని వైద్యులు, నర్సింగ్ సిబ్బంది నివాస ప్రాంతం వద్ద కూలిపోయింది. దుర్ఘటన జరిగినప్పుడు విమానంలో 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు సహా 12 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో ఒక్క ప్రయాణికుడు గాయాలతో బయటపడగా మిగిలిన 241 మంది
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ