నారాయణపురం రాష్ట్రంలోని టీజీ ఎస్ ఆర్ టీ సీ లో తొలి మహిళ.డ్రైవర్
అమరావతి, 15 జూన్ (హి.స.) సంస్థాన్‌ నారాయణపురం, రాష్ట్రంలోని టీజీఎస్‌ఆర్టీసీలో తొలి మహిళా బస్‌ డ్రైవర్‌గా యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలం సీత్యతండాకు చెందిన సరిత శనివారం విధుల్లోకి చేరారు. తొలి రోజు హైదరాబాద్‌ నుంచి మిర్యాలగూడకు
నారాయణపురం రాష్ట్రంలోని టీజీ ఎస్ ఆర్ టీ సీ లో తొలి మహిళ.డ్రైవర్


అమరావతి, 15 జూన్ (హి.స.)

సంస్థాన్‌ నారాయణపురం, రాష్ట్రంలోని టీజీఎస్‌ఆర్టీసీలో తొలి మహిళా బస్‌ డ్రైవర్‌గా యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలం సీత్యతండాకు చెందిన సరిత శనివారం విధుల్లోకి చేరారు. తొలి రోజు హైదరాబాద్‌ నుంచి మిర్యాలగూడకు బస్‌ నడిపారు. ఇన్నిరోజులు దేశ రాజధాని దిల్లీలో డ్రైవర్‌గా విధులు నిర్వర్తించారు. అయితే, తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉండటంతో వారిని చూసుకోవడానికి రాష్ట్రంలో బస్‌ డ్రైవర్‌గా అవకాశం ఇవ్వాలని గతంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని, సంబంధిత మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కోరారు. వారు స్పందించి ఆర్టీసీ డ్రైవర్‌గా ఆమెకు అవకాశం కల్పించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande