హైదరాబాద్, 16 జూన్ (హి.స.)ఫార్ములా ఈ కార్ రేసు కేసులో రెండోసారి ఏసీబీ విచారణకు హాజరయ్యే క్రమంలో బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై అధికార పార్టీ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కౌంటర్ వేశారు. చట్టంపై గౌరవం ఉందని చెబుతున్న కేటీఆర్ అదే సమయంలో విచారణను డైవర్ట్ చేయడానికి నాటకాలాడుతున్నాడు అంటూ ఆయన విమర్శించారు. ప్రజల ఎదుట తాను నిర్దోషినంటూ సత్యహరిశ్చంద్రుడిలా నటిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. విచారణకు హాజరయ్యేందుకు మేం ఎవరినీ బలవంతంగా పిలవలేం కానీ, ఒక వ్యక్తి చిత్తశుద్ధితో ఉంటే – విచారణకు సహకరించాల్సిన బాధ్యత ఉంటుంది. కేటీఆర్ మాత్రం విచారణపై వ్యంగ్యంగా స్పందిస్తూ బిల్డప్లు ఇస్తున్నాడని బల్మూర్ మండిపడ్డారు. తనపై అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆరోపిస్తున్న కేటీఆర్ అసలు సత్యాన్ని దాచి తనను నిర్దోషిగా చూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు” అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్