సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన సి.హెచ్.ప్రియాంక
హైదరాబాద్, 16 జూన్ (హి.స.) సమాచార పౌర సంబంధాల స్పెషల్ కమిషనర్ గా సి.హెచ్.ప్రియాంక ఇవాళ బాధ్య‌తలు స్వీకరించారు. ఆ శాఖ స్పెషల్ కమిషనర్ గా ఉన్న డా.హరీష్ ను తెలంగాణ జెన్కో ఎండీ గా బదిలీ చేసి మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ డిప్యూటీ సెక్రటరీ గా
ప్రియాంక ఐఏఎస్


హైదరాబాద్, 16 జూన్ (హి.స.)

సమాచార పౌర సంబంధాల స్పెషల్ కమిషనర్ గా సి.హెచ్.ప్రియాంక ఇవాళ బాధ్య‌తలు స్వీకరించారు. ఆ శాఖ స్పెషల్ కమిషనర్ గా ఉన్న డా.హరీష్ ను తెలంగాణ జెన్కో ఎండీ గా బదిలీ చేసి మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ డిప్యూటీ సెక్రటరీ గా ఉన్న సి.హెచ్. ప్రియాంక ను సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇవాళ‌ ఉదయం సచివాలయంలో డా.హరీష్ నుండి ప్రభుత్వ సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ సెక్రటరీగా, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ తో పాటు తెలంగాణా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ గా భాద్యతలను స్వీకరించారు. స్పెషల్ కమిషనర్ గా బాధ్య‌తలు స్వీకరించిన ప్రియాంకకు సమాచార శాఖ, ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్, మీడియా అకాడమీ అధికారులు అభినందనలు తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande