ఫ్లై ఓవర్ పై నుండి పడిన మామిడి కాయల వ్యాన్.. నలుగురు దుర్మరణం
యూపీ, 18 జూన్ (హి.స.) మామిడి కాయల లోడుతో వచ్చిన ఓ వ్యాన్ అదుపుతప్పి ఫ్లైవోవర్ పైనుంచి దూసుకెళ్లి కింద మార్నింగ్ వాక్ చేస్తున్న వాళ్లపై పడింది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రా పోలీస్ స్
రోడ్డు ప్రమాదం


యూపీ, 18 జూన్ (హి.స.)

మామిడి కాయల లోడుతో వచ్చిన ఓ వ్యాన్ అదుపుతప్పి ఫ్లైవోవర్ పైనుంచి దూసుకెళ్లి కింద మార్నింగ్ వాక్ చేస్తున్న వాళ్లపై పడింది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రా పోలీస్ స్టేషన్ ఏరియాలోని షాద్రా ఫ్లైవోవర్ దగ్గర నేటి ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందిన వెంటనే ఆగ్రా పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద మృతుల్లో ముగ్గురు మార్నింగ్ వాకర్స్ కాగా, ఒకరు వ్యాన్ డ్రైవర్ అని పోలీసులు తెలిపారు. వ్యాన్లో ఉన్న హెల్పర్ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడని చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande