కొత్త మెడికల్ కాలేజీల్లో సిబ్బంది కొరత లేకుండా చూడాలని.వెంటనే ఫ్యాకల్టీ లను భర్తీ .చేయాలి
అమరావతి, 19 జూన్ (హి.స.) అమరావతి, ): కొత్త మెడికల్‌ కాలేజీల్లో సిబ్బంది కొరత లేకుండా చూడాలని, ఫ్యాకల్టీని వెంటనే భర్తీ చేయాలని నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఎంసీ) రాష్ట్ర అధికారులను ఆదేశించింది. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడి
కొత్త మెడికల్ కాలేజీల్లో సిబ్బంది కొరత లేకుండా చూడాలని.వెంటనే ఫ్యాకల్టీ లను భర్తీ .చేయాలి


అమరావతి, 19 జూన్ (హి.స.)

అమరావతి, ): కొత్త మెడికల్‌ కాలేజీల్లో సిబ్బంది కొరత లేకుండా చూడాలని, ఫ్యాకల్టీని వెంటనే భర్తీ చేయాలని నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఎంసీ) రాష్ట్ర అధికారులను ఆదేశించింది. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్‌ కాలేజీల్లో లోపాలను ఎన్‌ఎంసీ తీవ్రంగా పరిగణించింది. రెండేళ్లు గడువిచ్చినా ప్రభుత్వం కనీసం లోపాలు సరిదిద్దకపోవడంతో ఏపీ అధికారులకు ఘాటు లేఖ రాసింది. వెంటనే ఢిల్లీకి వచ్చి సమాధానం చెప్పాలని కోరింది. దీంతో రాష్ట్ర అధికారులు ఆగమేఘాల మీద ఢిల్లీకి పరుగులు తీశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande