ఖమేనీ ప్రభుత్వాన్ని కూల్చేయండి.. ఇరానీయులకు రాజవంశీయుడు రెజా పహ్లవి పిలుపు
ఢిల్లీ , 19 జూన్ (హి.స.) ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రభుత్వాన్ని కూల్చేస్తేనే ఇరాన్ సుభిక్షంగా ఉంటుందని ఇరాన్ రాజవంశీయుడు రెజా పహ్లవి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోను విడుదల చేశారు. ఇస్లామిక్ రిపబ్లిక్ ముగింపు దిశకు చేరుకుందని.
ఖమేనీ ప్రభుత్వాన్ని కూల్చేయండి.. ఇరానీయులకు రాజవంశీయుడు రెజా పహ్లవి పిలుపు


ఢిల్లీ , 19 జూన్ (హి.స.) ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రభుత్వాన్ని కూల్చేస్తేనే ఇరాన్ సుభిక్షంగా ఉంటుందని ఇరాన్ రాజవంశీయుడు రెజా పహ్లవి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోను విడుదల చేశారు. ఇస్లామిక్ రిపబ్లిక్ ముగింపు దిశకు చేరుకుందని.. త్వరలో కూలిపోతుందని తెలిపారు. భవిష్యత్ బాగుండాలంటే ఇరానీయులు తిరగబడాలని కోరారు. ఇది తిరగబడే సమయమని.. ఇరాన్‌ క్షేమంగా ఉండాలంటే ఇదే మంచి సమయమని.. త్వరలో మీతో ఉంటానని రెజా పహ్లవి పేర్కొన్నారు. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకరమైన యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఇరానీయులను ఉద్దేశించి ఇరాన్ షా మొహమ్మద్ రెజా పహ్లవి వంశస్థుడు క్రౌన్ ప్రిన్స్ రెజా పహ్లవి కీలక ప్రసంగం చేశారు. ఇరాన్ ప్రజలు అనిశ్చితిని ఎదుర్కొంటున్న సమయంలో ఖమేనీ రహస్య బంకర్‌లో దాక్కున్నాడని.. అలాంటి వ్యక్తి దేశాన్ని ఏం కాపాడతాడని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande