బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ తో మంత్రి లోకేష్ భేటీ
న్యూడిల్లీ, 19 జూన్ (హి.స.)బ్రిటన్ మాజీ ప్రధాని, టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్(టిబిఐ) వ్యవస్థాపకుడు టోనీ బ్లెయిర్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ న్యూడిల్లీలో భేటీ అయ్యారు. న్యూడిల్లీలోని తాజ్ ప్యాలెస్
బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ తో మంత్రి లోకేష్ భేటీ


న్యూడిల్లీ, 19 జూన్ (హి.స.)బ్రిటన్ మాజీ ప్రధాని, టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్(టిబిఐ) వ్యవస్థాపకుడు టోనీ బ్లెయిర్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ న్యూడిల్లీలో భేటీ అయ్యారు.

న్యూడిల్లీలోని తాజ్ ప్యాలెస్ లో టోనీ బ్లెయిర్ ను మంత్రి లోకేష్ (Nara Lokesh) కలుసుకుని పలు అంశాలపై చర్చించారు. గత ఏడాది జులైనెలలో బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ ను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముంబాయిలో కలిశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యావ్యవస్థలో ఎఐ టూల్స్ ను ఉపయోగించడానికి తమ సంస్థ అయిన టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్(టిబిఐ) Institute for Global Change ద్వారా సహకరించేందుకు టోనీ బ్లెయి ర్ అంగీకరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande