ఢిల్లీ 19 జూన్ (హి.స.)తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం ఢిల్లీకి బయలుదేరారు. ఆయనతో పాటు నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా ఈ రెండు రోజుల పర్యటనలో పాల్గొంటున్నారు. ఈ పర్యటనలో భాగంగా, ఉదయం 11 గంటలకు ఇంగ్లండ్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం సమావేశం కానుంది. ప్రస్తుతం టోనీ బ్లెయిర్ ‘టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ (TBI)’ అనే సంస్థను నడుపుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ