జోగులాంబ గద్వాల జిల్లాలో లారీల దగ్ధం..
జోగులాంబ గద్వాల, 20 జూన్ (హి.స.) జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం, వేముల స్టేజి సమీపంలో అర్ధరాత్రి రెండు గంటల సమయంలో జాతీయ రహదారిపై భారీ ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న భారీ లోడుతో స్లో గా వెళ్తున్న ఆళ్ళగడ్డల లా
లారీల ఆక్సిడెంట్


జోగులాంబ గద్వాల, 20 జూన్ (హి.స.)

జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల

మండలం, వేముల స్టేజి సమీపంలో అర్ధరాత్రి రెండు గంటల సమయంలో జాతీయ రహదారిపై భారీ ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న భారీ లోడుతో స్లో గా వెళ్తున్న ఆళ్ళగడ్డల లారీని, వెనుకనే స్పీడ్ గా వస్తున్న బండలలోడు లారీఢీ కొనడంతో ఒక్కసారిగా భారీ మంటలు వ్యాపించాయి. కాగా రెండు లారీల లోని డ్రైవర్లు, క్లీనర్లు బయటకి దూకి ప్రాణాలను దక్కించుకున్నారు.

జాతీయ రహదారిపై ఒక్కసారిగా భారీ మంటలు వ్యాప్తి చెందడంతో హైవేపై వెళ్లే ప్రయాణికులకు ఏం జరిగిందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ మంటలు సుమారు రెండు గంటల పాటు చెలరేగాయి. హుటాహుటిన రెండు ఫైర్ ఇంజన్లతో ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande