గోల్డ్ ధరలు.. నేడు మళ్లీ పెరిగాయ్
అమరావతి, 21 జూన్ (హి.స.)నిన్న భారీగా తగ్గి ఊరటనిచ్చిన బంగారం ధరలు నేడు ఉసూరుమనిపించాయి. ఇవాళ తులం పసిడి ధర రూ. 270 పెరిగింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.10,075, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,235 వద్ద ట్రేడ్ అవుత
గోల్డ్ ధరలు.. నేడు మళ్లీ పెరిగాయ్


అమరావతి, 21 జూన్ (హి.స.)నిన్న భారీగా తగ్గి ఊరటనిచ్చిన బంగారం ధరలు నేడు ఉసూరుమనిపించాయి. ఇవాళ తులం పసిడి ధర రూ. 270 పెరిగింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.10,075, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,235 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 250 పెరిగింది. దీంతో రూ. 92,350 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 270 పెరిగింది. దీంతో రూ. 1,00,750 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 250 పెరిగింది. దీంతో రూ. 92,500 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 270 పెరిగింది. దీంతో రూ. 1,00,900 వద్ద ట్రేడ్ అవుతోంది. నేడు సిల్వర్ ధరలు ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande