నేడు బాధ్యతలు స్వీకరించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్
హైదరాబాద్, 21 జూన్ (హి.స.) ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ బాధ్యతలు స్వీకరించారు. ఇవాళ ఉదయం సచివాలయంలో తనకు కేటాయించిన చాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అడ్లూ
మంత్రి అడ్డూరి


హైదరాబాద్, 21 జూన్ (హి.స.)

ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ బాధ్యతలు స్వీకరించారు. ఇవాళ ఉదయం సచివాలయంలో తనకు కేటాయించిన చాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అడ్లూరికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వర్రావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తోపాటు సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అడ్లూరి మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande