శిల్పా లేఅవుట్ రెండో దశ ఫ్లైఓవర్కు సీఎల్పీ మాజీ నేత పీ జనార్దన్ రెడ్డి పేరు..
హైదరాబాద్, 21 జూన్ (హి.స.) శిల్పా లేఅవుట్ రెండో దశ ఫ్లైఓవర్కు సీఎల్పీ మాజీ నేత పీ జనార్దన్ రెడ్డి పేరు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ ఫ్లైఓవర్ ను ఈ నెల 28న ప్రారంభించనున్నట్టు మేయర్ గద్వాల విజయలక్ష్మి ''ఎక్స్ ''లో ప్రకటించారు. కొం
ఫ్లైఓవర్


హైదరాబాద్, 21 జూన్ (హి.స.)

శిల్పా లేఅవుట్ రెండో దశ ఫ్లైఓవర్కు సీఎల్పీ మాజీ నేత పీ జనార్దన్ రెడ్డి పేరు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ ఫ్లైఓవర్ ను ఈ నెల 28న ప్రారంభించనున్నట్టు మేయర్ గద్వాల విజయలక్ష్మి 'ఎక్స్ 'లో ప్రకటించారు. కొండాపూర్ నుంచి గచ్చిబౌలి వరకు అనుసంధానించే పీజేఆర్ (పీ జనార్ధన్ రెడ్డి) ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుందని తెలిపారు. ప్రఖ్యాత రాజకీయ నాయకుడు, ప్రజా సేవకుడు పీ జనార్ధన్ రెడ్డికి జ్ఞాపకార్థంగా ఫ్లైఓవర్ కు ఆయన పేరు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారని తెలిపారు. ప్రారంభోత్సవానికి ముందే పెయింటింగ్, సుందరీకరణ సహా అన్ని పనులను పూర్తి చేయాలని మేయర్ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ను ఆదేశించారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande