కంచ గచ్చిబౌలి భూములపై విచారణ వాయిదా
హైదరాబాద్, 23 జూన్ (హి.స.) రాష్ట్ర రాజకీయాల్లో సంచలనo సృష్టించిన కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారానికి సంబంధించిన దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై విచారణను తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. కంచ గచ్చిబౌలి భూములను రాష్ట్ర ప్రభుత్వం టీజీఐఐసీకి అప్పగించడంత
భూముల విచారణ


హైదరాబాద్, 23 జూన్ (హి.స.)

రాష్ట్ర రాజకీయాల్లో సంచలనo సృష్టించిన కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారానికి సంబంధించిన దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై విచారణను తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. కంచ గచ్చిబౌలి భూములను రాష్ట్ర ప్రభుత్వం టీజీఐఐసీకి అప్పగించడంతో పాటు భూమిని అభివృద్ధి చేసి ఐటీ కంపెనీలకు కేటాయించేలా టీజీఐఐసీ ప్రణాళికలను సిద్ధం చేసింది. ఈ క్రమంలో ఆ భూములను జేసీబీలతో చదును చేయడంతో ఈ చర్యను అడ్డుకోవాలని హైకోర్టులో వేర్వేరుగా 4 ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై వాదనల సందర్భంగా టీజీఐఐసీకి భూమిని అప్పగిస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేయాలని పిటిషనర్లు కోర్టును కోరారు. అయితే కంచగచ్చిబౌలి భూములకు సంబంధించిన కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారణలో ఉంది. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేస్తూ హైకోర్టు సీజే ధర్మాసనం నిర్ణయం తీసుకుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande