
అమరావతి, 23 జూన్ (హి.స.)
విజయవాడ: ఏపీ మద్యం కేసులో నిందితులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ల విచారణను విజయవాడ ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేసింది. మద్యం కేసులో ఏ31గా ధనుంజయరెడ్డి, ఏ 32గా కృష్ణ మోహన్ రెడ్డి ఉన్నారు. వీరు ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. నిందితులను సిట్ అధికారులు ఇప్పటికే రెండు రోజులపాటు విచారించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ