రాష్ట్రంలోని క్రీడాకారులకు శుభవార్త.. మంత్రి వాకిటి శ్రీహరి కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్, 23 జూన్ (హి.స.) రాష్ట్రంలో కొత్త క్రీడా పాలసీ తీసుకు రాబోతున్నామని దానిలో అన్ని రకాల క్రీడలకు ప్రాధాన్య ఇస్తామని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. త్వరలోనే క్రీడా పాలసీకి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపనుందని చెప్పారు. సీఎం కప్ పోటీలను నిర్వహ
మంత్రి శ్రీహరి


హైదరాబాద్, 23 జూన్ (హి.స.)

రాష్ట్రంలో కొత్త క్రీడా పాలసీ తీసుకు రాబోతున్నామని దానిలో అన్ని రకాల క్రీడలకు ప్రాధాన్య ఇస్తామని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. త్వరలోనే క్రీడా పాలసీకి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపనుందని చెప్పారు. సీఎం కప్ పోటీలను నిర్వహించి గ్రామ స్థాయి నుంచి క్రీడాకారులను వెలికితీసి జాతీయ స్థాయికి వెళ్లేలా ప్రోత్సహిస్తామన్నారు. ఇందుకోసం ప్రసిద్ధి చెందిన కోచ్ లను నియమిస్తామన్నారు.

ఇవాళ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ఒలింపిక్ డే వేడుకల్లో మంత్రి పాల్గొని మాట్లాడారు. ఒలింపిక్ పథకాలు సాదించిన క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందిస్తామని ఇప్పటికే బాక్సర్ నిఖత్ జరీన్, క్రికెటర్ మహ్మద్ సిరాజ్ కు డీఎస్పీ పోస్టులు ఇచ్చి గౌరవంగా సన్మానించామన్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande