డ్రగ్స్ కేసులో నటుడు ‘శ్రీరామ్’ కు రిమాండ్
అమరావతి, 24 జూన్ (హి.స.)తెలుగు, తమిళ్ హీరోగా నటించి గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు శ్రీరామ్ ను డ్రగ్స్ కేసులో పోలీసులు చెన్నై పోలీసులు అరెస్ట్ చేసారు. తమిళనాడుకు అన్నాడీఎంకే పార్టీకి చెందిన మాజీ కార్యనిర్వాహకుడు ప్రసాద్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడ
డ్రగ్స్ కేసులో నటుడు ‘శ్రీరామ్’ కు రిమాండ్


అమరావతి, 24 జూన్ (హి.స.)తెలుగు, తమిళ్ హీరోగా నటించి గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు శ్రీరామ్ ను డ్రగ్స్ కేసులో పోలీసులు చెన్నై పోలీసులు అరెస్ట్ చేసారు. తమిళనాడుకు అన్నాడీఎంకే పార్టీకి చెందిన మాజీ కార్యనిర్వాహకుడు ప్రసాద్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని పోలీసులకు సమాచారం రావడంతో అతడితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసారు. పోలీసుల స్టైల్ లో విచారణ చేపట్టగా కోలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన నటుడు శ్రీరామ్ కు డ్రగ్స్ సరఫరా చేస్తామని నిందితులు తెలిపారు. రంగమంలోకి దిగిన పోలీసులు శ్రీరామ్ అదుపులోకి తీసుకుని ఆయన వద్ద నుండి కొకైన్ స్వాదీనం చేసుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande