వర్షాకాలం నేపథ్యంలో సాగుకు ఉపయోగమైన ఎరువులు, విత్తనాలు కొరత లేకుండా చూస్తున్నాము.. ఖమ్మం జిల్లా కలెక్టర్
తెలంగాణ, ఖమ్మం. 24 జూన్ (హి.స.) వర్షాకాలం నేపథ్యంలో సాగుకు ఉపయోగమైన ఎరువులు, విత్తనాలు కొరత లేకుండా చూస్తున్నామని, ఇప్పటికే జిల్లాకు కావాల్సినన్ని ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచామని ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వెల్లడించారు. మంగళవారం
ఖమ్మం కలెక్టర్


తెలంగాణ, ఖమ్మం. 24 జూన్ (హి.స.)

వర్షాకాలం నేపథ్యంలో సాగుకు

ఉపయోగమైన ఎరువులు, విత్తనాలు కొరత లేకుండా చూస్తున్నామని, ఇప్పటికే జిల్లాకు కావాల్సినన్ని ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచామని ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వెల్లడించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఓ వైపు ఎరువులు, విత్తనాల కోసం పటిష్ట కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని, మరోవైపు వర్షాల నేపథ్యంలో ముంపు ప్రాంతాల పునరావాసం, పబ్లిక్ సేఫ్టీపై ప్రత్యేకంగా దృష్టి సారించామని చెప్పారు. ముంపు ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారగణం రెడీగా ఉన్నదని, ప్రతీరోజు అన్ని విషయాలపై డే టూ డే మానిటరింగ్ ఉంటుందని తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande