నేడు ఏపీ కేబినెట్ భేటీ ఉదయం.11,.గంటలకు అమరావతి.వేదికగా జరగనుంది
అమరావతి, 24 జూన్ (హి.స.) : నేడు (జూన్ 24) ఉద‌యం 11 గంట‌ల‌కు ఏపి క్యాబినెట్ భేటీ అమ‌రావ‌తి వేదికగా జరగనుంది. ఈ సమావేశంలో పలు ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వం ఆమోదం తెలపనుంది. ఇందులో భాగంగా.. 7వ ఎస్ఐపీబీ సమావేశంలో అమోదం తెలిపిన‌ 19 ప్రాజెక్టులకు సంబ
నేడు ఏపీ కేబినెట్ భేటీ ఉదయం.11,.గంటలకు అమరావతి.వేదికగా జరగనుంది


అమరావతి, 24 జూన్ (హి.స.)

: నేడు (జూన్ 24) ఉద‌యం 11 గంట‌ల‌కు ఏపి క్యాబినెట్ భేటీ అమ‌రావ‌తి వేదికగా జరగనుంది. ఈ సమావేశంలో పలు ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వం ఆమోదం తెలపనుంది. ఇందులో భాగంగా.. 7వ ఎస్ఐపీబీ సమావేశంలో అమోదం తెలిపిన‌ 19 ప్రాజెక్టులకు సంబంధించి రూ.28,546 కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే ఈ సమావేశంలో వైజాగ్ లో కాగ్నిజెంట్ ఏర్పాటు కు సంబంధించి చర్చ జరగనుంది. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలోని 1450 ఎకరాల్లో మౌలిక వసతులు కల్పనకు 1052 కోట్లతో టెండర్ పిలవడానికి కూడా ఆమోదం తెల‌ప‌నుంచి క్యాబినెట్. సీడ్ యాక్సెస్ రోడ్ ను నేషనల్ హైవే – 16 కు కలిపేందుకు 682 కోట్లతో టెండర్లు పిలిచెందుకు సంబంధిచి క్యాబినెట్ లో అమోదం తెల‌ప‌నున్నారు.

అమ‌రావ‌తి రెండో ద‌శ‌లో 44 వేల ఎక‌రాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా సేక‌రించే అంశంలో క్యాబినెట్ లో చ‌ర్చించే అవ‌కాశం ఉంది. అలాగే రాష్ట్రంలో ప‌లు సంస్థ‌ల‌కు భూ కేటాయింపులకు అమోదం తెలిపే అవ‌కాశం ఉంది. ఏడాది పాల‌న పూర్తియిన సంద‌ర్బంగా క్యాబినెట్ లో చర్చించనున్నారు. అలాగే ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాల‌సీ పై చ‌ర్చించి అమోదించే అవకాశం కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు కొత్త పట్టణాభివృద్ధి సంస్థల ఏర్పాటు, పట్టణాభివృద్ధి సంస్థల పునర్వ్యవస్థీకరణ దిశగా ప్రభుత్వ అడుగులు పడనున్నాయి. ఇవాళ జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనికి ఆమోదముద్ర వేసే అవకాశం లేకపోలేదు. అన్నదాత సుఖిభవ పధకం విధి విధానాలు ఏర్పాటు చేసి.. ఆ పై చరించనున్నారు. కేబినెట్ తర్వాత తాజా రాజకీయ పరిణామాల పై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించే అవకాశం లేకపోలేదు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande