ప్రభుత్వ దవాఖాన ను తనిఖీ చేసిన ఖమ్మం జిల్లా కలెక్టర్..
తెలంగాణ, ఖమ్మం. 25 జూన్ (హి.స.) ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లో పారిశుద్ధ్య కార్మికులు సమ్మె బాట పట్టడంతో ఆసుపత్రిలో పారిశుద్ధ్య లోపించింది. ఆసుపత్రిలో ఎక్కడపడితే అక్కడ వ్యర్థాలు ఉండటంతో బుధవారం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సందర్శించారు. ఆ
ఖమ్మం కలెక్టర్


తెలంగాణ, ఖమ్మం. 25 జూన్ (హి.స.)

ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి

లో పారిశుద్ధ్య కార్మికులు సమ్మె బాట పట్టడంతో ఆసుపత్రిలో పారిశుద్ధ్య లోపించింది. ఆసుపత్రిలో ఎక్కడపడితే అక్కడ వ్యర్థాలు ఉండటంతో బుధవారం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సందర్శించారు. ఆసుపత్రి లోపల వచ్చిన తర్వాత అక్కడ ఆసుపత్రి సూపరింటెండెంట్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఎవరు లేకపోవడంతో ఆయనే స్వయంగా లోపలికి వెళ్లారు. ఆసుపత్రిలో ఎక్కడపడితే అక్కడ అపరిశుభ్రంగా ఉండడంతో సూపరింటెండెంట్ పై సీరియస్ అయ్యారు కలెక్టర్.

కార్మికులు సమ్మెలో ఉంటే మీరు ఆసుపత్రిలో ఏం చేస్తున్నారు అంటూ సూపరింటెండెంట్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయంగా ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటూ మండిపడ్డారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande