రామేశ్వరం వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్..!
హైదరాబాద్, 25 జూన్ (హి.స.) ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. వివిధ మార్గాల్లో ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లను జులై వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. చర్లపల్లి-రామేశ్వరం, రామేశ్వరం-చర్లపల్లి, హైదరాబాద్-కొల్లం, కొల్లం-హైదరాబాద్
రైల్వే గుడ్ న్యూస్


హైదరాబాద్, 25 జూన్ (హి.స.)

ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. వివిధ మార్గాల్లో ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లను జులై వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. చర్లపల్లి-రామేశ్వరం, రామేశ్వరం-చర్లపల్లి, హైదరాబాద్-కొల్లం, కొల్లం-హైదరాబాద్ మార్గాల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ రైళ్లను పొడిగిస్తున్నట్లు చెప్పింది. చర్లపల్లి-రామేశ్వరం (07695) రైలు జులై 2వ తేదీ నుంచి 23 వరకు పొడిగించినట్లు పేర్కొంది. ఈ రైలు ప్రతి బుధవారం అందుబాటులో ఉంటుందని తెలిపింది. రామేశ్వరం -చర్లపల్లి (07696) రైలు ప్రతి శుక్రవారం జులై 4 నుంచి 26 వరకు ప్రతి శుక్రవారం రాకపోకలు సాగిస్తుందని చెప్పింది. హైదరాబాద్-కొల్లం (07193) రైలు జులై 5 నుంచి 26 వరకు ప్రతి శనివారం.. కొల్లం-హైదరాబాద్ (07194) రైలు జులై 7 నుంచి 28 వరకు ప్రతి సోమవారం నడుస్తుందని దక్షిణ మధ్య రైల్వే వివరించింది.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande