
సంగారెడ్డి.25 జూన్ (హి.స.)
శ్రీ పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి కొలువుదీరిన దివ్యధామం సంగారెడ్డి జిల్లాలోని ఝరాసంగం ఆలయం నేడు భక్తులతో కిక్కిరిసింది. బుధవారం జేష్ఠ అమావాస్య సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి భక్తులు స్వామివారి దర్శనం కోసం భారీగా తరలిరావడంతో ఆలయం రద్దీగా మారింది. క్యూలైన్లు నిండిపోయాయి. స్వామివారి సర్వదర్శనం కోసం 3 గంటల సమయం పట్టింది.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..