తిరుమల అప్డేట్.. 24 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు
తిరుమల, 25 జూన్ (హి.స.)కలియుగ దైవం అయిన ఆ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు నిత్యం వేల సంఖ్యలో తిరుమలకు వస్తుంటారు. ఇటీవల కాలంలో రవాణా వ్యవస్థ అత్యంత వేగంతో పాటు సులభతరం కావడంతో తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతు
తిరుమల


తిరుమల, 25 జూన్ (హి.స.)కలియుగ దైవం అయిన ఆ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు నిత్యం వేల సంఖ్యలో తిరుమలకు వస్తుంటారు. ఇటీవల కాలంలో రవాణా వ్యవస్థ అత్యంత వేగంతో పాటు సులభతరం కావడంతో తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతుంది. గడిచిన 50 రోజుల్లో నిత్యం ఇదే పరిస్థితి కనబడింది. దీంతో తిరుమల కొండపై నిత్యం ఎక్కడ చూసిన భక్తుల సమూహాలతో పండుగ వాతావరణం కనబడుతుంది.

ఇందులో భాగంగా ఈ రోజు తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు ఎగబడ్డారు. దీంతో 24 కంపార్టుమెంట్లలో శ్రీవారి దర్శనం భక్తులు వేచి ఉన్నారు. దీంతో టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

కాగా మంగళవారం కూడా శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. దీంతో నిన్న శ్రీవారిని 79,466 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 29,227 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. దీంతో నిన్న భక్తుల కానుకల ద్వారా రూ.4.05 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ తెలిపింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande