
విజయవాడ, 26 జూన్ (హి.స.)
ఏపీలోని కోనసీమ జిల్లా ఆలమూరు ఎస్ఐ అశోక్ తన సిబ్బందితో ప్రైవేట్ వాహనంలో ఓ కేసు విషయమై రాజమండ్రి నుండి హైదరాబాద్ కు రాత్రి బయలుదేరారు. తెల్లవారుజామున హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ మండలం దుర్గాపురం వద్ద లారీని వెనుక నుంచి వీరు ప్రయాణిస్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఎస్సై అశోక్ కానిస్టేబుల్ బ్లెస్సిన్ మృతి చెందారు. హెడ్ కానిస్టేబుల్ స్వామి, డ్రైవర్ రమేష్ తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉండడంతో కోదాడ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి