తగ్గుముఖం పడుతున్న బంగారం ధరలు.. తులం ధర ఎంత ఉందో తెలుసా..?
ముంబై, 27 జూన్ (హి.స.)బంగారం ధరల్లో ప్రతి రోజు మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతున్నాయి. తాజాగా జూన్‌ 27వ తేదీన తులం బంగారంపై స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 98,020 రూ
Gold


ముంబై, 27 జూన్ (హి.స.)బంగారం ధరల్లో ప్రతి రోజు మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతున్నాయి. తాజాగా జూన్‌ 27వ తేదీన తులం బంగారంపై స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 98,020 రూపాయలు ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 89,850 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఇక వెండి విషయానికొస్తే కిలో వెండి ధర కూడా అతి స్వల్పంగానే తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర లక్షా 7,900 రూపాయల వద్ద కొనసాగుతోంది.

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,020 ఉండగా, 22 క్యారెట్ల ధర 89,850 వద్ద ఉంది. ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,170 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.90,000 వద్ద కొనసాగుతోంది. ఇక ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,020 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.89,850 వద్ద ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande