అక్కినేని నాగార్జున రియల్ హీరో.. సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
హైదరాబాద్, 28 జూన్ (హి.స.) టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగార్జున పై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. శనివారం ఔటర్ రింగు రోడ్డు నుంచి కొండాపూర్ వరకు నిర్మించిన పీజేఆర్ ఫ్లైఓవర్ను సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హైదరా
సీఎం రేవంత్ రెడ్డి


హైదరాబాద్, 28 జూన్ (హి.స.)

టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగార్జున పై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. శనివారం ఔటర్ రింగు రోడ్డు నుంచి కొండాపూర్ వరకు నిర్మించిన పీజేఆర్ ఫ్లైఓవర్ను సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హైదరాబాద్లో అనేక నాలాలు, చెరువులు కబ్జాలకు గురయ్యాయని ఆరోపించారు. హైడ్రా ద్వారా ఆక్రమణలు తొలగిస్తున్నామని చెప్పారు. ఎన్ కన్వెన్షన్లో రెండు ఎకరాల భూమిని సినీ నటుడు అక్కినేని నాగార్జున స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించారని తెలిపారు. భూమిని అప్పగించిన నాగార్జున రియల్ హీరో అని కొనియాడారు.

హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయి నగరాలైన న్యూయార్క్, ట్యోక్యో వంటి నగరాలతో పోటీ పడేలా చేయాలన్నదే తమ తాపత్రయం అని అన్నారు. ఈ యజ్ఞానికి ఎంతమంది రాక్షసులు అడ్డుపడినా చేసి తీరుతామని ప్రకటించారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande